SKLM: జలుమూరు సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహ ప్రహరీ గోడ కూలిపోయింది. మంగళవారం సాయంత్రం భారీగా పడుతున్న వర్షాలకు ఈ ఘటన జరిగినట్లుగా అధికారులు తెలిపారు. ఘటనా స్థలాన్ని మండల ప్రత్యేక అధికారి అరుంధతి దేవి, ఎంఈవో బమ్మిడి మాధవరావు వెళ్లి పరిశీలించారు. పురాతన ప్రహరీ కావడంతో ఈ పరిస్థితి వచ్చిందని వారన్నారు. అయితే ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలియజేశారు.