TPT: వెంకటగిరి మండలం పంజం పంచాయతీ తెలుగు గంగ కాలువ వద్ద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. ఈ సందర్భంగా అక్కడ రాకపోకలు నిలిపివేసిన సీఐ ఏవీ రమణ నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. మండల అధికారులతో కలిసి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులతో పాటు పోలీసు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.