AP: రాష్ట్ర ప్రభుత్వం తుఫాన్ నష్ట నివారణపై దృష్టి పెట్టింది. కూలిన చెట్ల తొలగింపు, విద్యుత్ పునరుద్ధీకరణ, రోడ్ల క్లియరెన్స్‌పై దృష్టి సారించింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది. యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థికసాయం ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.5 వేలు ఇవ్వాలని నిర్ణయించింది.