ప్రయాణికుల సాకర్యార్థం విజయవాడ-సికింద్రబాద్ మధ్య నడిచే శాతవాహన ఎక్స్ప్రెస్(12713/12714)కు జనగామ రైల్వేస్టేషన్లో హల్టింగ్ కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రేపటి నుంచే ట్రైన్ జనగామలో ఆగుతుందని పేర్కొన్నారు. విజయవాడ నుంచి వచ్చేటప్పుడు ఉ.10:14 గంటలకు, తిరుగు ప్రయాణంలో సా.5:19 గంటలకు స్టేషన్ చేరుకుంటుందని వెల్లడించారు.