AP: తీవ్ర తుఫానుగా తీరం దాటిన ‘మొంథా’ తుఫాన్ బలహీనపడినట్లు IMD పేర్కొంది. ‘నర్సాపూర్ పశ్చిమ వాయవ్య దిశలో 20KM, మచిలీపట్నానికి ఈశాన్యంగా 50KM, కాకినాడకు పశ్చిమ-నైరుతి దిశలో 90KM, విశాఖకు నైరుతి దిశలో 230KM, గోపాల్పూర్ (ఒడిశా)కు నైరుతి దిశలో 470KM దూరంలో కేంద్రీకృతమై ఉంది. 6 గంటలపాటు తుఫాన్ తీవ్రతను కొనసాగించి తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉంది’ అని పేర్కొంది.