ELR: తుఫాను తీరం దాటిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కిషోర్ సూచించారు. మంగళవారం రాత్రి ఆయన ఏలూరు నగరంలో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలంతా ఇళ్లకే పరిమితమవ్వాలని సూచించారు. ప్రయాణాలను మానుకోవాలన్నారు. వ్యాపారస్తులు తమ దుకాణాలను స్వచ్చందంగా మూసివేయాలని అన్నారు.