HYD: తుఫాన్ ఎఫెక్ట్ నగరంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. గ్రేటర్ వ్యాప్తంగా అనేక చోట్ల నిర్విరామంగా ముసురు కురుస్తుంది. దీంతో పాఠశాలలకు వెళ్లేందుకు ఇబ్బందులు తప్పవని, మరోవైపు చలి తీవ్రత సైతం పెరిగిందని, ప్రభుత్వం సెలవు ప్రకటించాలని పలువురు విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలకు కాల్స్ చేస్తూ విన్నవిస్తున్నారు.