HNK: ఉమ్మడి జిల్లాలో విద్యార్థినులపై టీచర్ల లైంగిక వేధింపుల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వారం క్రితం ఎంహెచ్బీడీ ప్రభుత్వ బడిలో జరిగిన ఘటన మరువకముందే భూపాలపల్లిలో మరో బడిలో పీఈటీ విద్యార్థినులను వేధించాడని ఆరోపణలు వచ్చాయి. ఆగ్రహంతో తల్లిదండ్రులు అతనిని చితకబాదగా, అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.