AP ప్రజలను మొంథా తుఫాన్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికే తీరం దాటిన ఈ తుఫాన్ కారణంగా పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు ఈదురుగాలుల కారణంగా కరెంట్ స్తంభాలు కూలిపోవడంతో అంబేద్కర్, కోనసీమ జిల్లాలలో 17 గంటలుగా కరెంట్ సరఫరా నిలిచిపోయింది. పలు ప్రాంతాలు రాత్రి నుంచి అంధకారంలోనే ఉన్నాయి.