NLR: ఉదయగిరి మండలం బిజ్జంపల్లిలో ఎస్సీ, ఎస్టీ కాలనీల ప్రజల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ పరిశీలించారు. వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు దుప్పట్లు, ఆహార పదార్థాలు పంపిణీ చేసి అవసరమైన సహాయం అందించనున్నట్లు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.