ASR: సైబర్ నేరగాళ్లు ఏకంగా అల్లూరి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేశ్ కుమార్ పేరిట ఒక ఫేక్ సోషల్ మీడియా అకౌంట్‌ను సృష్టించారు. కలెక్టర్ దినేష్ కుమార్ పేరిట మెసెంజర్లో నకిలీ అకౌంట్‌ను సృష్టించి, డబ్బులు కావాలని పలువురికి మెసేజ్‌లు పెడుతున్నారు. దీంతో మంగళవారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కలెక్టర్ అప్రమత్తమయ్యారు. దీనిపై ఎవరూ స్పందించవద్దని సూచించారు.