KRNL: కోడుమూరులోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్ డా.ఏ.సిరి ఇవాళ తనిఖీ చేశారు. వంటశాలను పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారా, లేదా అని వంట నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల రికార్డులను పరిశీలించి, విద్యార్థుల హాజరు పట్టిక వివరాలను అడిగి తెలుసుకున్నారు.