VZM: మొంథా తుఫాన్ నేపథ్యంలో కొత్తవలస మండల కేంద్రంలో ఉన్న లోతట్టు ప్రాంతాలను ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి క్షేత్రస్థాయిలో అధికారులతో కలసి మంగళవారం సందర్శించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని ప్రజలను కోరారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించారు. పర్యటనలో కూటమి నాయకులు, నీటిపారుదల శాఖ సిబ్బంది పాల్గొన్నారు.