ప్రకాశం: కనిగిరి మండలం నేలటూరి గొల్లపల్లి కొత్తూరు మాలపల్లి వద్ద విద్యుత్ స్తంభం ఒరిగి ప్రమాదకరంగా ఉంది. ఒరిగిన విద్యుత్ స్తంభానికి స్థానికులు సపోర్టుగా ఒక మొద్దును ఏర్పాటు చేశారు. ఎప్పుడు కూలిపోతుందో ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందో అని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు చొరవ చూపి విద్యుత్ స్తంభాన్ని సరిచేయాలని కోరుతున్నారు.