ప్రపంచ అపరకుబేరుడు ఎలాన్ మస్క్ వికీపీడియాకు పోటీగా గ్రోకిపీడియాను తీసుకొచ్చారు. ఇది AI ఆధారితంగా పనిచేస్తుంది. వికీపీడియా కంటే 10 రెట్లు బెటర్ అని ప్రకటించారు. మస్క్‌కు చెందిన AI కంపెనీ xAI గ్రోకిపీడియా ప్లాట్‌ఫారమ్‌ను తీసుకొచ్చింది. ఇది Grokకు conversational AI మోడల్. వాస్తవాలను ఆధారంగా తీసుకుని కచ్చితమైన సమాచారం అందించడం దీని ఉద్ధేశమని మస్క్ అంటున్నారు.