VZM: తుఫాన్ నేపథ్యంలో తప్పుడు వార్తలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఏఆర్. దామోదర్ మంగళవారం హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక కేంద్రాలకు తరలిస్తున్నామని, ఇలాంటి సమయంలో కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పోస్ట్ చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని అలాంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.