MNCL: సమాజ రక్షణ కోసం పోలీసులు పని చేస్తున్నారని లక్షెట్టిపేట ఎస్సై సురేష్ అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి లక్షెట్టిపేట పట్టణంలోని గాంధీ చౌక్ నుండి ఉత్కూరు చౌరస్తా వరకు పోలీసులు, ప్రముఖులు కలిసి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరి రక్షణ బాధ్యతను నిర్వహిస్తూ పోలీసులు శాంతి భద్రతలను కాపాడుతున్నారని తెలిపారు.