MDCL: గోరక్షక్ కార్యకర్త బిడ్ల ప్రశాంత్పై ఘట్కేసర్లో జరిగిన కాల్పుల కేసులో కేవలం 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్న రాచకొండ పోలీసుల చురుకుదనాన్ని గోరక్షక్ సభ్యులు ప్రశంసించారు. ఈ సందర్భంగా సభ్యులు రావుల శ్రీకాంత్, ఇతర గోరక్షక్ ప్రతినిధులు నేరెడ్మెట్ ఆఫీసులో రాచకొండ సీపీ సుధీర్ బాబుకు దర్యాప్తు పట్ల కృతజ్ఞతలు తెలిపారు.