ASF: చింతలమానపల్లి మండలం డబ్బా గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కార్మికులు పెండింగ్ వేతనాలను చెల్లించాలని DLPOకు సోమవారం వినతి పత్రం అందజేశారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు 4 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాల్సి ఉందన్నారు. వేతనాలు రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. DLPO సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారిస్తానన్నారు.