అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామం ఈడిగపల్లిలో మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన శివ, నాగేంద్రలపై పోక్సో కేసు నమోదు అయిందని ఎస్సై రవీంద్రబాబు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో లోపలికి చొరబడి దాడికి ప్రయత్నించగా, స్థానికులు వారిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.