ఆస్ట్రేలియాతో జరగబోయే వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. న్యూజిలాండ్తో మ్యాచ్లో సూపర్ సెంచరీతో అదరగొట్టిన ఓపెనర్ ప్రతీక రావల్, గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగింది. దీంతో ఆమె స్థానంలో షెఫాలీ వర్మను జట్టులోకి తీసుకున్నారు. ఆస్ట్రేలియాతో ‘డూ ఆర్ డై’ మ్యాచ్లో ప్రతీక దూరం కావడం భారత్కు పెద్ద లోటుగా చెప్పవచ్చు.