SKLM: తుఫాన్ నేపథ్యంలో పలాస కాశీబుగ్గ పరిధిలో సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ నడిపేన రామారావు పేర్కొన్నారు. పలాస- కాశీబుగ్గ పురపాలక సంఘం కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులు, సచివాలయం సిబ్బందితో సోమవారం ఆయన సమావేశం నిర్వహించారు. ప్రజలకు త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, ప్రజల ఆరోగ్య పరిరక్షణపై సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు.