TG: మొంథా తుఫాన్ ప్రభావంతో HYDలో వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాన్ ఆంధ్ర తీరం వైపు పయనిస్తుండటంతో తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో తెలికపాటి నుంచి మోస్తరు వర్షం పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.