MDK: శివంపేట మండలం చిన్న గొట్టిముక్కల శివారు చాకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయ స్వామి ఆలయంలో కార్తీకమాసము సోమవారం పురస్కరించుకొని కార్తీక దీపోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో భక్తులు పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ ప్రాంగణము కార్తీక మాసం పురస్కరించుకుని దీపోత్సవం నిర్వహించారు.