MBNR: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన హ్యాండ్‌బుక్‌ను కలెక్టర్ విజయేందిర బోయి, అదనపు కలెక్టర్ శ్రీ శివేంద్ర ప్రతాప్, డీఈవో ప్రవీణ్ కుమార్ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో చదువుతున్న బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తు ప్రధానోపాధ్యాయులపైనే ఆధారపడి ఉందని పేర్కొన్నారు.