JN: దేవరుప్పుల మండల నూతన ఎంపీడీవోగా మంగళవారం మేనక పౌడెల్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, అధికారులు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మండల గ్రామాల అభివృద్ధికి పూర్తి కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.