W.G: తుపాన్ నేపథ్యంలో అత్యవసర వైద్య సేవల నిమిత్తం పెనుమంట్ర మండల కేంద్రంలోని సచివాలయం వద్ద ఫస్ట్ ఎయిడ్ క్యాంపు ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎవరికి ఎలాంటి వైద్య అవసరాలు ఉన్నా, ఫస్ట్ ఎయిడ్ క్యాంపు అందుబాటులో ఉంటుందని, అలాగే ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో తమని సంప్రదించాలని ఏఎన్ఎంలు భాగ్యకుమారి, సుజాత సూచించారు.