మేడ్చల్: కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన చౌరస్తా అంబేడ్కర్ విగ్రహం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ ఆంజనేయులు, ఎస్ఐ హరిప్రసాద్ ఆధ్వర్యంలో ప్రైవేట్ కళాశాల విద్యార్థులతో భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరులకు జోహార్ అంటూ నివాళులర్పించారు.