SKLM: తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అధికారులు ఆదేశించారు. మంగళవారం ముందస్తుగా తన కార్యాలయంలో మండల అధికారులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పునరావస కేంద్రాల్లో సకాలంలో భోజనాలు, మందులు, నిత్యావసర సరుకులు అందేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.