ELR: తుఫాన్ ప్రభావంతో కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జీలుగుమిల్లి మండలంలో ఉదృతంగా ప్రవహించే వాగులను పోలవరం డీఎస్పీ ఎం. వెంకటేశ్వరావు, సీఐ, ఎస్సైలు మంగళవారం పరిశీలించారు. వాగులు ప్రవహించే సమయంలో ప్రజలెవ్వరు కాజ్వేలు, కల్వర్టులు దాటొద్దని హెచ్చరికలు జారీ చేశారు. పలు ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలన్నారు.