SRD: ఖేడ్ నియోజకవర్గం శంకరంపేట మండలం విరోజ్ పల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ మాజీ సర్పంచ్ BRS సీనియర్ నేత కిష్టప్ప గారి కిషన్ (70) మంగళవారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారని గ్రామస్తులు తెలిపారు. ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆయన మృతికి సంతాపం తెలిపారు.