KMR: బీర్కూరు మండల నూతన ఎంపీడీవోగా శ్రీనిధి మంగళవారం బాధ్యతలను స్వీకరించారు. మాక్లూర్ మండలం మామిడిపల్లి ఆమె స్వస్థలం. గ్రూప్ వన్ పరీక్షల్లో మొదటి ప్రయత్నంలోనే ఎంపికై, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సంపాదించారు. ఈ సందర్భంగా మండల కార్యాలయ సిబ్బంది ఆమెకు ఘన స్వాగతం పలికారు.