W.G: “మొంథా తుఫాన్” నేపథ్యంలో మంగళవారం ఉండి ఎంపీడీవో కార్యాలయంలో సంబంధిత అధికారులు, నాయకులతో శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో ఎటువంటి నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. అలాగే అధికారులకు పలు సూచనలు సలహాలు అందజేశారు.