సిరిసిల్ల: రైతులు అధైర్య పడవద్దు తడిసిన ధాన్యం సైతం కొనుగోలు చేస్తామని ఫ్యాక్స్ ఛైర్మన్ బండి దేవదాస్ అన్నారు. తంగళ్ళపల్లి మండలంలో తడిసిన ధాన్యాన్ని గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో నష్టపోయిన రైతుల నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని స్పష్టం చేశారు. తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.