AP: మొంథా తుఫాన్ కారణంగా రూ.5వేల 265 కోట్ల నష్టం జరిగిందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. వ్యవసాయ రంగంలో రూ.829 కోట్ల నష్టం, హార్టికల్చర్ రంగంలో రూ.39 కోట్లు, సెరికల్చర్ రంగంలో రూ.62 కోట్లు, ఆక్వా రంగంలో రూ.1,270 కోట్లు, మున్సిపల్ శాఖలో రూ.109 కోట్లు, పశుసంవర్థకశాఖలో రూ.71 లక్షల నష్టం జరిగిందని వివరించారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు.