ASF: గంజాయి సాగు, అక్రమ రవాణా, వినియోగంపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఆసిఫాబాద్ ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 69 కేసులు నమోదు చేసి 120 మందిని జైలుకు పంపించామన్నారు. సంబంధిత శాఖల అధికారులు పోలీసు శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.