TPT: ఏర్పేడు మండలం ఆమందూరు పంచాయతీ టీడీపీ కార్యకర్త సుబ్రహ్మణ్య యాదవ్ ఆకస్మికంగా మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు.