KMM: కల్లూరు పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి హాజరై కేక్ కట్ చేశారు. మంత్రి పొంగులేటి సుఖ సంతోషాలతో ఉండి మరెన్నో జన్మదిన వేడుకలు నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు.