ADB: భీంపూర్ మండలంలోని నిపాని గ్రామంలో ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు నగేశ్ సోమవారం పర్యటించారు. గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు సన్నిత్ రెడ్డి నానమ్మ పొచ్చుబాయి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ధైర్యంగా ఉండమని భరోసా కల్పించారు.