NZB: మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని సీపీ సాయిచైతన్య అన్నారు. నగరంలోని తన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి 11 మంది సీపీని కలిసి తమ సమస్యలు విన్నవించారు. వాటిని పరిశీలించిన సీపీ, వాటిని చట్టరీత్యా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.