KMM: గుర్తుతెలియని వ్యక్తులు చేపల చెరువులో పురుగుల మందు కలిపి విషప్రయోగానికి పాల్పడ్డారు. కారేపల్లి మండలంలోని మాధారం చేపల చెరువులో గత రాత్రి దుండగులు పురుగుల మందు కలపగా రూ.10లక్షల విలువైన చేపలు చనిపోయాయని మత్స్యకారులు వాపోయారు. ఈమేరకు వారి ఫిర్యాదుతో మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై బి. గోపి తెలిపారు.