W.G: మొంథా తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు బుధవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు, పాఠశాలలకు, అంగన్వాడీలకు కలెక్టర్ చదలవాడ నాగరాణి సెలవు ప్రకటించారు. ఉత్తర్వులను అన్ని విద్యాసంస్థలు తప్పకుండా పాటించాలని ఆదేశించారు. పిల్లలు బయట తిరగనివ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు.