WGL: GWMC ప్రధాన కార్యాలయం ఎదుట 19వ డివిజన్ వాసులు మంగళవారం ధర్నా చేపట్టారు. తమ ప్రాంతంలో సరఫరా అవుతున్న రంగు మారిన తాగునీటి సమస్యపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనకారులు మున్సిపల్ అధికారులకు రంగు మారిన నీటిని సీసాలలో అందజేసి వినూత్నంగా నిరసన తెలిపారు. తాగునీటి నాణ్యతను నిర్ధారించి, శుభ్రమైన నీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.