ATP: మొంథా తుఫాను కారణంగా ఉరవకొండలో చేనేతల ఇళ్లలోకి నీళ్లు వెళ్లడంతో మగ్గాలు తడిసిపోయాయి. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశాలతో మంగళవారం ఆయా వార్డుల్లో అధికారులు పర్యటించారు. మగ్గం గుంతల్లోకి వర్షపు నీరు వెళ్లి నష్టపోయిన చేనేతల వివరాలను తీసుకుని జిల్లా ఉన్నత అధికారులకు నివేదికను పంపించారు.