AKP: పరవాడ మండలం దిబ్బపాలెం గ్రామంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పూరి గుడిసె దెబ్బతింది. సోమవారం రాత్రి గుడిసె కిందకి దిగిపోవడంతో కుటుంబ సభ్యులందరూ బయటకు వచ్చి వేరే ఇంటిలో తల దాచుకుంటున్నట్లు బాధితుడు చోడిపల్లి నూకరాజు మంగళవారం తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన తమకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని కోరారు.