ATP: కార్తీక మాసం వేళ చిన్నపోలమడకు చెందిన నాలుగేళ్ల చిన్నారి తేజశ్రీ శివభక్తిని చాటుకుంది. తల్లిదండ్రులతో కలిసి పెద్దపప్పూరు మండలం అశ్వత్థం క్షేత్రానికి వచ్చిన తేజశ్రీ ఇసుకతో స్వయంగా శివుడి లింగాన్ని ఏర్పాటు చేసింది. ఆ లింగం ముందు కార్తీక దీపాలు వెలిగించి, పూజలు నిర్వహించారు. చిన్న వయసులోనే ఆ చిన్నారి చూపిన శివభక్తి స్థానికులను ఆకట్టుకుంది.