కృష్ణా: ‘మొంథా’ తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో మచిలీపట్నం పోర్టులో రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సముద్రంలో అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో మత్స్యకారులు ఎవ్వరూ వేటకు వెళ్లవద్దని అధికారులు ఇప్పటికే కోరారు. అలాగే వేటకు వెళ్లిన వారిని కూడా తిరిగి వచ్చేలా సంకేతాలు జారీ చేశారు. దీంతో మత్స్యకారులంతా తమ బోట్లకు లంగర్లు వేసి ఇళ్ల వద్దనే ఉన్నారు.