TPT: నాగలాపురం మండలం టీపీ పాలెం సమీపంలోని గొడ్డేరు వాగు వద్ద రోడ్డుపై వరద ప్రవాహం పెరుగుతోందని సర్పంచ్ పళని తెలిపారు. భూపతీశ్వర కోన నుంచి భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతుందని అందుకోసం గొడ్డేరు వాగు వద్ద ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు గొడ్డేరు వాగులో దిగవద్దని సూచించారు. గ్రామంలోని ప్రజలు తుఫాను సందర్భంగా వంకలు, వాగుల వద్దకు వెళ్లవద్దని కోరారు.