BDK: జూలూరుపాడు పట్టణంలోని ఓంటిగుడిసె క్రాస్ రోడ్ వద్ద రైతు వేదిక రోడ్డు ఎదురుగా ఉన్న మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్ వాల్ దగ్గర లీకేజీ వల్ల మంచి నీరు వృథాగా పోతోందని మంగళవారం స్థానికులు ఆరోపించారు. అధికారుల పర్యవేక్షణ లోపం నిర్లక్ష్యం కారణంగానే లీకేజీపై అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు.