AP: బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తీవ్ర తుఫాన్‌గా బలపడింది. ఈ మేరకు విశాఖలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడిచిన 6 గంటలుగా గంటకు 15KM వేగంతో ఉత్తర వాయవ్య దిశగా తుఫాన్ కదిలిందని తెలిపింది. ప్రస్తుతం మచిలీపట్నానికి 190KM, కాకినాడకు 270KM, విశాఖకు 340KM దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైనట్లు పేర్కొంది. ఇవాళ సాయంత్రం లేదా రాత్రికి తీవ్ర తుఫాన్ తీరం దాటే అవకాశముందని వెల్లడించింది.